: రాజకీయాలు తప్ప.. ఈ సర్కారుకు ప్రజా శ్రేయస్సు పట్టడం లేదు: బాబు


గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. వరదబాధితులను పరామర్శించేందుకు పర్యటిస్తున్న చంద్రబాబు, ప్రత్తిపాడు మండలం కొయ్యవారిపాలెంలో భారీవర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరద బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన సరిగా లేదని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో బిజీగా ఉన్న కాంగ్రెస్ కు ప్రజల వెతలు పట్టడం లేదని బాబు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News