: ఆదివారం ప్రారంభంకానున్న 'అంగారక యాత్ర' కౌంట్ డౌన్


భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంగారక గ్రహయాత్ర... మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)కు ఆదివారం కౌంట్ డౌన్ ప్రారంభంకానుంది. ఆదివారం ఉదయం 6.08 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ ప్రయోగానికి పీఎస్ ఎల్ వీ-సీ25 రాకెట్ ను ఉపయోగిస్తున్నారు. నవంబర్ 5న మధ్యాహ్నం 2.38 గంటలకు శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ నుంచి రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి రూ. 430 కోట్లు ఖర్చయింది. ఈ ప్రయోగంతో భారత్ ఇతర దేశాలతో అంతరిక్ష రంగంలో పోటీపడుతోందని భావించరాదని ఇస్రో చైర్మన్ తెలిపారు.

  • Loading...

More Telugu News