: శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాలయిన శీశైలం, వేములవాడ, ఏడుపాయలకు రవాణా సంస్థ హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతుందని ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు తెలిపారు. ప్రత్యేక బస్సులు ఈ నెల 8 నుంచి 13 వరకు ఆయా రూట్లలో తిరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎంజీబిఎస్ వద్ద ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అలాగే ఏడుపాయల పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు జేబీఎస్, బాలానగర్ నుంచి బస్సులు నడుపుతారని కోటేశ్వరరావు తెలిపారు. కాగా, ఈ బస్సుల్లో 50 శాతం ఛార్జీని అదనంగా వసూలు చేయనున్నారు.