: తమిళ జాలర్ల రిమాండ్ పొడిగించిన శ్రీలంక కోర్టు


తమిళనాడులోని రామేశ్వరం, కరైకల్ ప్రాంతాలకు చెందిన 39 మంది తమిళ మత్స్యకారుల రిమాండ్ ను శ్రీలంకలోని మన్నార్ కోర్టు పొడిగించింది. వీరిలో రామేశ్వరానికి చెందిన నలుగురు జాలర్ల రిమాండ్ ను నవంబర్ 13 వరకు పొడిగించింది. కరైకల్ కు చెందిన 35 మంది రిమాండ్ ను నవంబర్ 14 వరకు పొడిగించింది. వీరంతా శ్రీలంకలోని జాఫ్నా, వావునియా జైళ్లలో శిక్షను అనుభవిస్తున్నారు. అక్టోబర్ 4, అక్టోబర్ 14 తేదీల్లో వీరంతా తమ జలాల్లోకి ప్రవేశించారంటూ శ్రీలంక నేవీ సిబ్బంది వీరిని అరెస్టు చేసింది.

  • Loading...

More Telugu News