: పయ్యావులను సస్పెండ్ చేయాలి: ఎర్రబెల్లి
పార్టీ అనుమతి తీసుకోకుండా విభజనపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీని ఇరుకున పెట్టేందుకే కాంగ్రెస్ మళ్లీ అఖిలపక్షం అంటోందని ఆరోపించారు. విభజనకు అనుకూలంగా తాము పార్టీని ఒప్పించామని, అందువల్ల అఖిలపక్షానికి తమ పార్టీ వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ శాఖను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.