: నాగపూర్ మ్యాచ్ భారత్ కైవసం


ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. నాగపూర్లో ఈ రోజు జరిగిన డే నైట్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 350 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదటి నుంచీ దీటుగా జవాబిచ్చింది. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల నష్టంతో భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (100), రోహిత్ శర్మ (79) పరుగుల వరద పారించి, స్కోరు బోర్డుని పరుగెత్తించారు. వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ (115 నాటౌట్) చెలరేగి ఆడడంతో విజయం భారత్ పక్షాన నిలిచింది. దీంతో సీరీస్ 2-2 తో సమానం అయింది. బెంగళూరులో జరిగే చివరి వండేలో గెలుపును బట్టి సీరీస్ ఎవరిదన్నది తేలుతుంది!

  • Loading...

More Telugu News