: వోల్వో బస్సు ప్రమాదంపై హెచ్ఆర్సీలో పిటిషన్


మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని శివసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మురళీధర్ దేశ్ పాండే ఈ రోజు రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసు విచారణకు స్వీకరించిన కమిషన్ సభ్యులు కాకుమాను పేదపేరిరెడ్డి ఈ ఘటనపై సమగ్ర నివేదికను నవంబర్ 27 లోపు అందజేయాలని ఆ జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు, బాధిత కుటుంబాలకు రూ.15 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ లో కోరారు.

  • Loading...

More Telugu News