: 'ఆడు మగాడ్రా బుజ్జీ' పాటల వేడుక
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు నటించిన ఆడు మగాడ్రా బుజ్జీ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. హైదరాబాదులోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. సుధీర్ సరసన ఈ చిత్రంలో అస్మితా సూద్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన గంగదాసు కృష్ణారెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీ కొమ్మినేని చిత్రానికి బాణీలు అందించారు. ఈ సినిమాకు సుబ్బారెడ్డి, ఎస్.ఎన్. రెడ్డి నిర్మాతలు. కాగా, ఈ ఆడియో ఫంక్షన్ కు మహేశ్ బాబు ముఖ్య అతిథిగా, కృష్ణ, విజయనిర్మల విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.