: రుణమాఫీపై కేంద్రాన్ని రూ.72 వేల కోట్లు అభ్యర్థిస్తాం: ముఖ్యమంత్రి
విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం నారాయణపురంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుణమాఫీకై 72 వేల కోట్ల రూపాయలు సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని అభ్యర్థిస్తామని అన్నారు. మాఫీ చేయలేని పక్షంలో వడ్డీ లేకుండా కొత్త రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాగా, వరదల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజలు ముందుగా తమకు సాయం చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.