: మరోసారి అఖిలపక్ష భేటీ పెట్టడం శుభ పరిణామం: టీజీ
మరోసారి అఖిలపక్ష భేటీకి కేంద్రం సుముఖత తెలపడంపై మంత్రి టీజీ వెంకటేశ్ స్పందించారు. ఇదో శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. ఈ భేటీకి పార్టీల అధినేతలందరూ హాజరుకావాలన్నారు. చంద్రబాబు, జగన్, నారాయణలు సమైక్యాంధ్రకు అనుకూలంగా భేటీలో లేఖలివ్వాలన్నారు. అలాకాకుండా సమన్యాయమని ఎవరన్నా అంటే, వారు విభజనకు అంగీకరించినట్లేనన్నారు. మార్కులు పెంచుకోవాలని జగన్ చూస్తే ప్రజలకు న్యాయం జరగదన్నారు.