: విభజన తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి పయ్యావుల లేఖ
రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసినట్లు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. సంప్రదింపుల మేరకు విభజన చేయాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని తెలిపారు. టీడీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన ప్రక్రియ పూర్తికాదన్నారు. విభజన ప్రక్రియ శాసనసభలోనే ప్రారంభం కావాలని రాజ్యాంగంలో చెప్పారన్నారు.