: 'బస్సు ప్రమాద మృతుల బంధువులు సాయంత్రం లోపు ఘటనాస్థలికి రావాలి'


మహబూబ్ నగర్ బస్సు ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు బంధువులు ఈ సాయంత్రం 5 గంటల లోపు ఘటనాస్థలికి రావాలని అధికారులు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద ఘటనాస్థలిలోనే మృతదేహాలకు అధికారులు శవపరీక్షలు నిర్వహించారు. శవపరీక్ష నిర్వహించిన ఏడు మృతదేహాలను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగతా మృతదేహాలను సాయంత్రం 5 తరువాత ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. డీఎన్ఏ పరీక్ష కోసం మృతుల కుటుంబీకులు హైదరాబాదులోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో రక్త నమూనాలు ఇవ్వాలని సూచించారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలోపు మృతుల కుటుంబీకులు రక్త నమూనాలు ఇవ్వాలని అధికారులు కోరారు.

  • Loading...

More Telugu News