: 'విశ్వరూపం'పై ఇది ఓ బోగస్ పిల్ లా ఉంది: హైకోర్టు
’విశ్వరూపం‘ చిత్రాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... సరైన ఆధారాలు, కారణాలు చూపకుండా ... ఏ విషయాన్నీ పిటిషన్ లో స్పష్టం చేయకుండా వ్యాజ్యాన్ని ఎలా దాఖలు చేస్తారంటూ పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం చాటున, ఇది ఓ బోగస్ పిల్ పిటిషన్ లా కనిపిస్తోందని హెచ్చరించిన ధర్మాసనం... ఈ పిటిషన్ దాఖలు చేసినందుకు రూ.50 వేల జరిమానా విధిస్తామని అతని తరపు న్యాయవాదిని హెచ్చరించింది. తక్షణమే వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకొని పూర్తి వివరాలతో మరల పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.