: టాస్ గెలిచిన భారత్.. రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్


చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు నాగపూర్ లో జరుగుతున్న ఆరో వన్డేలో బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 45 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 13 పరుగులు చేసిన ఓపెనర్ ఫిల్ హ్యూస్ యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ కు వికెట్ అప్పగించాడు. ఇక, విధ్వంసక బ్యాట్స్ మన్ ఫించ్ (20 )వికెట్ ను అశ్విన్ చేజక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 15 ఓవర్లలో 2 వికెట్లకు 59 పరుగులు కాగా.. క్రీజులో వాట్సన్ (19 బ్యాటింగ్), కెప్టెన్ బెయిలీ (6 బ్యాటింగ్) ఉన్నారు.

  • Loading...

More Telugu News