: బస్సులో పేలుడు పదార్థాలు ఉన్నాయా..?


జబ్బార్ ట్రావెల్స్ ప్రమాదంపై పలు కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి దగ్గరకు వస్తుండడంతో ప్రయాణికుల వద్ద కానీ, పార్శిల్ రూపంలో కానీ పేలుడు పదార్థాలు ఏవైనా బస్సులో ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బస్సు అదుపు తప్పడంతో కల్వర్టును ఢీ కొని డీజిల్ ట్యాంకు పేలిన 3 నిమిషాల్లోనే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. దీంతో, బస్సులో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా? అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది.

  • Loading...

More Telugu News