: రెండు లక్షల విలువైన గంజాయి స్వాధీనం
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి మండలంలోని ఆకుమామిడికోట గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న రెండు బస్తాల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.