: అమెరికన్ కాంగ్రెస్ లో నేడే తొలి దీపావళి


భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న దీపావళి పండుగను అమెరికన్ కాంగ్రెస్ నేడు తొలిసారిగా జరుపుకుంటోంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి వేద మంత్రాల నడుమ జరగనున్న ఈ దీపావళి వేడుకలకు రెండు డజన్లకుపైగా అమెరికా చట్టసభ సభ్యులు హాజరుకానున్నారు. రాజధాని వాషింగ్టన్ లో దీపాలను వెలిగించనున్నారు. హ్యాపీ దివాళి చెప్పేందుకే తాను వచ్చినట్లు ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ నేత నాన్సీ పెలోసి అన్నారు.

  • Loading...

More Telugu News