: ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తాం: బీజేపీ
రానున్న 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. కాగా, దేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీకి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇటీవలే పాట్నాలో ఆయన సభకు కొద్దిసేపటి ముందు బాంబు పేలుళ్ళు జరిగిన సంగతి తెలిసిందే. ఆ పేలుళ్ళ కారణంగా ఆరుగురు మరణించగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు.