: నిలిచిన బంగారం తవ్వకం.. ఏమీలేదని తేల్చిన పురావస్తు శాఖ
ఓ సాధువు కల ఆధారంగా.. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లా దాండియా ఖేరా గ్రామంలో బంగారం కోసం జరుపుతున్న తవ్వకాలను భారతీయ పురావస్తు శాఖ (ఏఎస్ఐ) నిలిపివేసింది. ఇక్కడి రాజా రాంభక్ష్ సింగ్ కోటలో 1000 టన్నుల బంగారం ఉందని తనకు కల వచ్చిందంటూ శోభన్ సర్కార్ అనే సాధువు చెప్పిన మాటలతో పన్నెండు రోజుల పాటు తవ్వకాలు జరిపారు. ఈ సమయంలో యూపీ సర్కారు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం వద్ద పూర్తి భద్రత ఏర్పాటు చేసింది. కాగా, తవ్వకాల్లో బుద్ధుడి కాలం నాటి కుండలు, కొన్ని గదులు మాత్రమే బయటపడ్డాయని ఏఎస్ఐ తెలిపింది.