: నేటితో ముగిసిన సంజయ్ దత్ పెరోల్ గడువు


అనారోగ్యం కారణంగా బయట ఉన్న నటుడు సంజయ్ దత్ పెరోల్ గడువు నేటితో ముగిసింది. కాలుకు శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సంజయ్ 14 రోజుల పెరోల్ పై అక్టోబర్ ఒకటిన పుణెలోని యరవాడ జైలు నుంచి బయటకు వచ్చాడు. వెంటనే, మరో పద్నాలుగు రోజుల పెరోల్ ను జైలు అధికారులు మంజూరు చేయడంతో కుటుంబ సభ్యులతో గడిపాడు. పొడిగించిన పెరోల్ గడువు నేటితో ముగియటంతో రేపు తిరిగి జైలుకు వెళ్లనున్నాడు. 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ కు సుప్రీంకోర్టు ఐదు సంవత్సరాల శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News