: హుక్కా సెంటర్లు నిషేధించండి: బీజేపీ
హైదరాబాదులో హుక్కా సెంటర్లను నిషేధించాలని గ్రేటర్ బీజేపీ నేతలు సీపీ అనురాగ్ శర్మ కు విజ్ఞప్తి చేశారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్లు, గుట్కా అమ్మకాలను పోలీసులు పట్టించుకోవడంలేదని సీపీని కలిసిన గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ఆరోపించారు. వెంటనే హుక్కా సెంటర్లపై నిషేధం విధించి పటిష్ఠంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పబ్ లు, బార్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.