: వాయలార్.. నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో: కేటీఆర్
తెలంగాణ అంశాన్ని అప్పడాలు, దోసెలతో పోల్చిన కేంద్ర మంత్రి వాయలార్ రవిపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతిలేని మాటలు కట్టిపెట్టాలని ఈటెల వ్యాఖ్యానించగా.. వాయలార్ తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు బుద్ధిహీనులు గనుకనే తెలంగాణను అప్పడాలు, దోసెలతో పోల్చుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.