: చైనా సైనిక పరిణామాలను గమనిస్తున్నాం: అమెరికా
చైనా మిలటరీకి సంబంధించి తాజా పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. చైనా తన ఉద్దేశాలు, తన సామర్థ్యాల విషయంలో అత్యున్నత పారదర్శకత పాటించాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జెన్ సాకి అన్నారు. చైనాతో స్థిరమైన రక్షణ సంబంధాలను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.