: లారీ టూల్ బాక్స్ లో మహిళ అస్థిపంజరం
మహబూబ్ నగర్ జిల్లాలోని బిజినేపల్లి పోలీస్ స్టేషన్ లోని లారీలోని టూల్ బాక్స్ లో మహిళ అస్థిపంజరం కలకలం సృష్టిస్తోంది. ఏడేళ్ల క్రితం 2007లో జనవరి 10న జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో బిజినేపల్లి పోలీసులు రెండు లారీలను స్వాధీనం చేసుకుని స్టేషన్ సమీపంలో ఉంచారు. ఈ కేసు రెండేళ్ల క్రితం కొట్టేశారు. అప్పటి నుంచి అక్కడే పడి ఉన్న లారీలు చెడిపోవడంతో, అందులోని ఓ లారీకి మరమ్మతు చేసేందుకు మెకానిక్ ను వెంటబెట్టుకుని వచ్చాడు యజమాని. మెకానిక్ టూల్ బాక్స్ తెరవగా అందులో ఓ మహిళ అస్థిపంజరం కన్పించింది. దీంతో, భయాందోళనలకు గురైన మెకానిక్ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. అస్థిపంజరం బిజినేపల్లికి చెందిన లక్ష్మమ్మదిగా భావిస్తున్నారు.