: రాజకీయాల్లోకి రావాలన్న కోరిక లేదు: సచిన్


కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు వస్తున్న వదంతులకు సచిన్ ముగింపు పలికాడు. తనకు ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలన్న ఆలోచన కానీ, రాజకీయ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేయాలన్న కోరిక కానీ లేవని తేల్చిచెప్పాడు. ఈ వివరాలను ఓ ప్రముఖ పత్రిక వెల్లడించింది. కాగా, తన రాజకీయ ప్రచార పర్వంపై వార్తలు వెల్లువెత్తుతుండటంపై సచిన్ తనకు ఆప్తులైన కొందరికి పర్సనల్ గా మెసేజ్ లు పంపినట్టు తెలుస్తోంది. ఇందులో తనపై వస్తున్న వార్తలను ఖండించినట్టు సమాచారం.

సచిన్ ఇప్పటిదాకా మచ్చలేని మనిషిగా బతికాడని... అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఎలా వస్తాడని? సచిన్ ఆత్మీయుడు ఒకరు అన్నారు. రాజకీయాల్లోకి వస్తే ప్రతి రోజూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవాల్సి వస్తుందని... ఎంతో పేరు ప్రఖ్యాతులున్న సచిన్ వాటికి దూరంగా ఉంటాడని తెలిపాడు. దీంతో, సచిన్ రాజకీయ అరంగేట్రం చేస్తాడన్న ఊహాగానాలకు ఆదిలోనే ముగింపు కార్డు పడింది.

  • Loading...

More Telugu News