: ఆయుధాల ఉత్పత్తి ప్రైవేటు రంగానికి అప్పగిస్తాం: ఏకే ఆంటోని


రక్షణ రంగంలో అవినీతిని రూపుమాపాలంటే స్వదేశీ ఆయుధాల తయారీ మరింత అభివృద్ది చెందాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ నేడు పార్లమెంటులో అభిప్రాయం వ్యక్తం చేశారు. విదేశాలతో ఆయుధ ఒప్పందాలు పలు సందర్భాల్లో వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయుధాలను మనదేశంలోనే తయారు చేస్తే మేలని అభిప్రాయపడ్డారు.

సంచలనం సృష్టించిన హెలికాప్టర్ల కుంభకోణంపై వివరణ ఇస్తూ పార్లమెంటులో ఆయన మాట్లాడారు. ప్రైవేటు సంస్థలకు రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆంటోనీ అన్నారు. 

  • Loading...

More Telugu News