: విభజనపై జీవోఎం కసరత్తులు జరుగుతున్నాయి: దిగ్విజయ్ సింగ్
రాష్ట్ర విభజన ప్రక్రియపై జీవోఎం కసరత్తులు ఎప్పుడో మొదలుపెట్టిందని, ప్రస్తుతం ఆ పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. జీవోఎంకు నవంబర్ 5 లోపు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజలు తమ అభిప్రాయాలను చెబుతారన్నారు. ఇరుప్రాంతాల ప్రజల అభిప్రాయాల ద్వారా స్పష్టత వస్తుందని, వాటి ద్వారా ముందుకు వెళతామని దిగ్విజయ్ వివరించారు.