: పాట్నా పేలుళ్ల కేసును ఎన్ఐఏ చేత దర్యాప్తు చేయించాలి: బీహార్ సర్కార్
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ 'హుంకార్' సభ లక్ష్యంగా పాట్నాలో జరిగిన పేలుళ్ల ఘటనపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ)తో దర్యాప్తు చేయించాలని బీహార్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.