: సత్యనారాయణ స్వామి సన్నిధిలో చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు ఈ ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. వరద బాధితులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా... ఆయన ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న రాత్రి అన్నవరం చేరుకున్న చంద్రబాబు ఈ రోజు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకు దేవాలయ వేద పండితులు, అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.