: వార్ధక్యంలోనూ జ్ఞాపకశక్తి పెరగాలంటే..


సీ-డ్రైవ్‌లో ఎంప్టీ స్పేస్‌ పెద్దగా లేకపోతే అంతే.. సిస్టం పెర్ఫార్మెన్స్‌ స్లో అయిపోతుంది. సీ-డ్రైవ్‌కు, మనిషి మెదడుకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. జ్ఞాపకాలు దొంతరల్లా పేరుకుపోయి... మెదడును అమితంగా ఆక్రమించేసే వేళకు అంటే వ్యక్తులకు వార్ధక్యం వచ్చే సమయానికి జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. మెదడు నిండుగా ఉన్న జ్ఞాపకాల ఫైల్స్‌ను సెర్చ్‌ చేసి అనుభవాలను వెలికి తీయడం సహజంగా స్లో అవుతూ ఉంటుంది.

అందుకే వృద్ధుల్లో జ్ఞాపకశక్తిని పెంచడానికి శాస్త్రవేత్తలు ఓ సులభమైన టెక్నిక్ కనిపెట్టారు. వంటకాల్లో మనం ఉపయోగించే మీల్‌మేకర్‌ తరహాలోనే మరో సోయాపిండిని కనుగొన్నారు. ఇందులో ఫిటోఈస్ట్రోజన్స్‌ అనే వృక్షాధార హార్మోన్లు ఉంటాయిట. యూనివర్సిటీ ఆఫ్‌ ఇండోనేషియా, బొగోర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీకి చెందిన వారు దీన్ని తయారుచేశారట. కొన్ని దేశాల్లో అనేకమంది వృద్ధులపై ప్రయోగాత్మకంగా పరిశీలించినప్పుడు మంచి ఫలితాలే వచ్చాయిట.

  • Loading...

More Telugu News