: ఫోన్లలోనే సినిమాలు చూసేస్తున్న భారతీయ కుర్రకారు


భారతీయ కుర్రకారు.. తమ మొబైల్‌ ఫోన్లలోనే ఇంటర్నెట్‌ ద్వారా సినిమాలు, సీరియళ్లు చూడడానికి ముచ్చట పడడంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంటున్నారట. నెమ్మదిగా బఫర్‌ కావడం వంటి సమస్యలు కొన్ని మొబైల్స్‌లో ఉండడం సహజమే గానీ.. వాటిని పట్టించుకోకుండా యువతరం మొబైల్స్‌నే సినిమా థియేటర్లుగా వాడేసుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

మొబైల్‌ వీడియో మరియు మీడియా సంస్థ 'ఉక్లిప్‌' వారు గ్లోబల్‌ వీడియో ఇన్‌సైట్స్‌ 2013 పేరిట నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా ఈ విషయాన్నే ధ్రువీకరించారు. 89 శాతం మంది తమ ఫేవరెట్‌ మూవీ అందుబాటులో ఉంటే మొబైల్‌పై చూడడానికి ముచ్చటపడతాం అని సెలవిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా 50వేల మందితో జరిపిన ఈ సర్వేలో భారత్‌ నుంచి 8000 మంది పాల్గొన్నారు. భారతీయుల్లోని 62 శాతం మంది బుల్లి వీడియో క్లిప్‌లకంటె, సినిమాలు సీరియళ్లనే తాము ఎక్కువగా ఫోన్లపై చూస్తుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News