: షీలా దీక్షిత్ కు ఉల్లిపాయల గిఫ్ట్ బాక్స్
ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ ను బీజేపీ సమయానికి తగ్గట్టుగా విమర్శిస్తోంది. తాజాగా దేశ ఆర్ధిక రాజధానిలో కేజీ ఉల్లి పాయల ధరలు తొంబై రూపాయలు పలికిన సంగతి తెలిసిందే. దాంతో, ప్రతిపక్ష పార్టీ కమలం సహా ఇతర పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కానీ, బీజేపీ నేతలు మరో ముందడుగేసి విభిన్న రూపంలో షీలాకు తమ నిరసన తెలియజేశారు. కొన్ని రోజుల్లో దీపావళి పండగ ఉండటంతో ఢిల్లీ బీజేపీ నేత విజయ్ జొల్లీ స్వయంగా షీలాను కలిసి బహుమతిగా ఉల్లిపాయల బాక్స్ ను సమర్పించారు. ఉల్లిపాయల ధరలను నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ వ్యాఖ్యానించింది.