: సీమాంధ్ర ప్రయోజనాలపై అధిష్ఠానంతో చర్చించాం : పళ్లంరాజు
రాష్ట్ర విభజన అనివార్యమైతే... సీమాంధ్ర ప్రయోజనాల కోసం ఏమేం చేయాలో అధిష్ఠానానికి సూచించామని కేంద్ర మంత్రి పళ్లంరాజు తెలిపారు. పారిశ్రామిక, విద్య, వాణిజ్య అవకాశాలపై చర్చలు జరిపామని వెల్లడించారు. ఈ రోజు విశాఖలో సీఐఐ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల వ్యాపార, పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి పళ్లంరాజు, పురంధేశ్వరి హాజరయ్యారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులను అధిష్ఠానం విస్మరిస్తోందన్న భావన సరికాదని పళ్లంరాజు తెలిపారు. పురంధేశ్వరి మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీ బలోపేతానికి సీనియర్ నేతలు అండగా నిలవాలన్నారు.