: బాహుబలిని పదిలక్షల మంది చూసేశారు..
ప్రభాస్, రానా ప్రధాన పాత్రధారులుగా జానపథ కథ నేపథ్యంలో.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి వీడియో యూట్యూబులో సందడి చేస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నారో తెలియజేస్తూ 1.48 నిమిషాల వీడియోను రాజమౌళి యూట్యూబులో పెట్టారు. దీనిని అప్పుడే పది లక్షల మంది చూసేశారు.