: అఖిలపక్ష సమావేశం అంటే సీఎంకి అలర్జీ: నారాయణ
బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేయమని పార్టీలు కోరుతుంటే.. ఆ సమావేశం అంటేనే అలర్జీ అన్నట్టుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్య ధోరణి సబబు కాదని నారాయణ హితవు పలికారు.
బాబ్లీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఒనగూరే మేళ్ల విషయంలో సర్కారు అప్రమత్తమవ్వాలని ఆయన సూచించారు. ఇక పోలవరం టెండర్లలో అవినీతితో రాష్ట్రం పరువు తీశారని నారాయణ విమర్శించారు. ఆ టెండర్ల ఖరారు వెనుక కచ్చితంగా రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు.