: రాయ్ బరేలీలో ప్రియాంక వాద్రా పర్యటన
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గంలో నేడు ప్రియాంక వాద్రా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తోన్న ఆమె... ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ క్రమంలో పార్టీ క్షేత్ర స్థాయి కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. ఈ ప్రాంతంలో గతంలో పలుసార్లు సోదరుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియాతో కలసి ప్రియాంక పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో ప్రియాంక రాయ్ బరేలిలో పర్యటిస్తుండటం ఇది రెండోసారి.