: విభజన పిటిషన్ పై విచారణ వాయిదా
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే విభజనకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. అయితే, విభజన నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని... దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తనవద్ద ఉన్నాయని పిటిషనర్ వాదించారు. దీంతో, విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.