: ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా జడ కొప్పులాట


మీకు వీలయితే దీపావళికి ముందు ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిరండి. పల్లెల్లో కులాలకు అతీతంగా ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఒక చక్కని వేడుకలో పాల్గొంటూ కనిపిస్తారు. అదే జడకొప్పులాట! రంగురంగుల వస్త్రాలతో పెద్దపెద్ద జడలను తయారుచేసి, వాటిని పైన వసారాకు వేలాడదీసి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ వారంతా ఆనందంలో మునిగి తేలుతారు. అలా చేస్తే తమకు ఐశ్వర్యం సిద్ధిస్తుందని వారి నమ్మకం. భారతీయ సంస్కృతి, ఆచారాలపై కరెన్సీ కాలం దాడి చేస్తున్నా.. ఇంకా వాటిని కాపాడేవారు ఉన్నారనడానికి ఇలాంటి వేడుకలే నిదర్శనం.

  • Loading...

More Telugu News