: ముజఫర్ నగర్ అల్లర్లకు ప్రతీకారంగానే పాట్నా పేలుళ్లు?
పాట్నా పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ పనిగా కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఆరుగురిని బలితీసుకున్న ఈ పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన తెహ్ సీన్ అక్తర్ ఉన్నట్లు, అతడే బాంబులను అందించినట్లు కేంద్ర హోంశాఖలోని వర్గాలు తెలిపాయి. ఈ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఐదుగురు వ్యక్తులు బాంబులు అమర్చినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అల్లర్లకు ప్రతీకారంగానే పాట్నాలో పేలుళ్లకు పాల్పడినట్లు విచారణలో నిందితుడు ఒకడు పేర్కొన్నట్లు సమాచారం. తెహ్ సీన్ అక్తర్ ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన అనుచరుడిగా హోంశాఖ వర్గాలు తెలిపాయి.