: నోబెల్ శాంతి బహుమతికి 259 నామినేషన్లు
ఈ ఏడాది ప్రకటించనున్న ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం ఇప్పటివరకు 259 నామినేషన్లు దాఖలయ్యాయి. వచ్చే అక్టోబరులో ప్రకటించే ఈ అవార్డుకు 209 మంది వ్యక్తులతోపాటు 50 సంస్థలు కూడా నామినేషన్లు పంపాయి.
కాగా, ఇటీవలే తాలిబాన్ల దాడిలో గాయపడి ప్రస్తుతం కోలుకున్న పాకిస్తాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ తోపాటు, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా నామినేట్ అయిన వారిలో ఉన్నట్టు నోబెల్ ప్రైజ్ నిర్వాహకులు వెల్లడించారు.