: రొమ్ము క్యాన్సరుకు ఇదే కారణమట
మహిళల్లో ఎక్కువగా కనిపించే రొమ్ము క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే కొత్త జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన అంతర్జాతీయ పరిశోధకుల బృందం క్యాన్సర్ ముప్పును సూచించే ఐఎన్టీ1 అనే కొత్త జన్యువులో క్యాన్సరును పెంచే అరుదైన ఉత్పరివర్తనాలను గుర్తించారు. ఈ ఉత్పరివర్తనాలు రొమ్ము, తదితర క్యాన్సర్లను పెంచేవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
తమ పరిశోధన గురించి ప్రొఫెసర్ మెలిసా సౌథీ మాట్లాడుతూ రొమ్ము క్యానర్ ముప్పుకు కారణమయ్యే తాము కనుగొన్న కొత్త జన్యువుకు సంబంధించిన వివరణ వల్ల, వ్యాధి ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యుల్లో క్యాన్సర్ ముప్పు పెరుగుదలకు సంబంధించిన అవగాహన పెరుగుతుందని చెబుతున్నారు. ఈ ఉత్పరివర్తనాలకు మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సరుకు సంబంధం ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని మెలిసా చెబుతున్నారు.