: వర్షాలతో 42 మంది మృతి చెందారు: రఘువీరా
గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 42 మంది మరణించారని మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ. 1.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు. 22 వేల ఇళ్ళు దెబ్బతిన్నాయని వివరించారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 543 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తమ్మీద రూ. 1,727 కోట్ల నష్టం వాటిల్లినట్టు మంత్రి వెల్లడించారు.