: రంజీ మ్యాచ్ లో తుస్సుమనిపించిన సచిన్


కెరీర్ చివరి టెస్టుకు సన్నాహకంగా రంజీ మ్యాచ్ లో బరిలో దిగిన బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులను నిరాశపరిచాడు. హర్యానాతో లాహ్లీలో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో కేవలం 5 పరుగులే చేసి అవుటయ్యాడు. సచిన్ వికెట్ మీడియం పేసర్ మోహిత్ శర్మ ఖాతాలోకి వెళ్ళింది. శర్మ విసిరిన గుడ్ లెంగ్త్ బంతి సచిన్ మోచేయిని తాకుతూ వెళ్ళి వికెట్లను గిరాటేసింది. ప్రస్తుతం ముంబయి జట్టు తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 64 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హర్యానా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులకే చాపచుట్టేసింది. అభిషేక్ నాయర్ 4 వికెట్లు తీశాడు.

  • Loading...

More Telugu News