: తెలంగాణకు బీజం వేసింది సోనియా కాదు.. వైఎస్సే: వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు బీజం వేసింది సోనియా కాదని, వైఎస్ రాజశేఖరరెడ్డేనన్న విషయం గ్రహించాలని హితవు పలికారు. ఇప్పుడు విభజన వద్దంటున్న జగన్.. చంద్రబాబును గద్దె దింపేందుకు వైఎస్ తెలంగాణ వాదాన్ని వినిపించినప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అగ్రకులాల ఆధిపత్యం చాటుకునేందుకే జగన్ హైదరాబాదులో 'సమైక్య శంఖారావం' సభ పెట్టారని వీహెచ్ ఆరోపించారు.