: పాట్నా వరుస పేలుళ్ళను ఖండించిన ప్రధాని


బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకున్న వరుస పేలుళ్ళపై ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. పేలుళ్ళను ఖండిస్తున్నట్టు తెలిపారు. భయపడాల్సిందేమీ లేదంటూ ప్రజలకు సూచించారు. ఇక, ఈ విషయమై ఆయన బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో మాట్లాడారు. పేలుళ్ళ ఘటనలపై దర్యాప్తును వేగవంతం చేయాలని, పేలుళ్ళ కారకులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, ఈ పేలుళ్ళలో ఒకరు మరణించగా, 20 మందికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News