: ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆరంభమైన మోడీ సభ
బీహార్ రాజధాని పాట్నాలో వరుస పేలుళ్ళ నడుమ నరేంద్ర మోడీ 'హుంకార్' సభ ఆరంభమైంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, అగ్రనేత అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యారు. పేలుళ్ళ నేపథ్యంలో సభకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా, పాట్నా చేరుకున్న ఎన్ఐఏ దళాలు పేలుళ్ళు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి.