: ఎస్ఎంఎస్ వస్తే ఫోన్ నుంచి పరిమళాలు


సెల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ వస్తే రింగ్ టోన్ ద్వారా తెలిసిపోతుంది. అది ఇక గతమంటోంది ఓ జపాన్ కంపెనీ. ఆ కంపెనీ వినూత్నరీతిలో ఓ చిన్న పరికరాన్ని తయారు చేసింది. మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తే సంకేతంగా.. మింట్, యాపిల్ సువాసనలు విడుదలవుతాయి. అంతేకాదు.. అలారమ్ కు కూడా శబ్ధానికి బదులుగా పరిమళాన్ని విడుదల చేస్తుంది. ఈ పరికరంలో సెంట్ తో కూడిన కాట్రిడ్జ్ ఉంటుంది. ఇలా 100 ఎస్ఎంఎస్ లకు సరిపడా సెంట్ అందులో ఉంటుందట. బావుంది కదా ఐడియా. ఈ పరికరం ఖరీదు 35 డాలర్లు (రూ.2,151). కాట్రిడ్జ్ ఖరీదు 5 డాలర్లు (రూ.307)గా ఉంది.

  • Loading...

More Telugu News