: దొంగతనం చేశాడని 14 ఏళ్ల బాలుడికి యాసిడ్ ఇంజెక్షన్
దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ యజమాని 14 ఏళ్ల బాలుడిని క్రూరంగా హింసించాడు. బీహార్లోని నలందా జిల్లాలో సూరజ్ కుమార్ ఒక పాత ఉక్కు సామాన్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడి వద్ద బాధిత బాలుడు పనిచేస్తున్నాడు. షాపులో దొంగతనం చేశాడని ఆరోపిస్తూ సూరజ్ స్పిరిట్, పెట్రోల్ ను సిరంజి సాయంతో బాలుడి మలవిసర్జన ద్వారం నుంచి లోపలకు ఎక్కించాడు. గాయాలపాలైన ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వాంగ్మూలంలో తనకు యాసిడ్ ఎక్కించాడంటూ యజమాని సూరజ్ పై బాలుడు పోలీసులకు తెలిపాడు.