: మరో నాలుగు పేలుళ్ళు.. పాట్నాలో టెన్షన్.. టెన్షన్!


బీహార్ రాజధాని పాట్నా వరుస పేలుళ్ళతో ఉలిక్కిపడింది. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు నరేంద్ర మోడీ సభ ఆరంభం కావాల్సి ఉండగా.. రెండు గంటల వ్యవధిలోనే ఆరు పేలుళ్ళు చోటు చేసుకోవడం పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఉదయం 11 గంటలకు రైల్వే స్టేషన్లో తొలి బాంబు పేలగా ఒకరు మరణించారు. ఆ తర్వాత నగరంలోని ఓ సినీ థియేటర్ వద్ద రెండో బాంబు పేలింది. అనంతరం, మోడీ సభ జరగనున్న గాంధీ మైదాన్ వద్ద మరో నాలుగు పేలుళ్ళు జరిగాయి. ఎన్ఐఏ దళాలు పాట్నా బయల్దేరాయి. పోలీసులు గాంధీ మైదాన్ వద్ద ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ పేలుళ్ళలో మొత్తం పది మంది గాయపడినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News