: 2014లో జరగబోయేది మహాభారత సంగ్రామమే: చిదంబరం
వచ్చే ఏడాది ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ మధ్య జరగబోయేది మహాభారత యుద్ధమేనని కేంద్ర మంత్రి చిదంబరం అన్నారు. ఆర్ఎస్ఎస్ మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసిందన్నారు. ఆర్ఎస్ఎస్ ను రాజకీయేతర సంస్థగా పేర్కొంటున్నారని, కానీ, ఆ సంస్థ పరోక్షంగా బీజేపీని నియంత్రిస్తోందన్నారు. రాక్షస విత్తనాలు నాటి మతం పేరుతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.